Thursday, September 24, 2009

నా I.A.S ఇంటర్వ్యూ ..

అది 27-Oct-2007 ....ఇండియన్ హిస్టరీ లోనే ఒక మరుపు రాని ఒక గొప్ప కీలక ఘట్టం...ఒకే సారి ఇద్దరి candidates ను ఇలా ఇంటర్వ్యూ చెయ్యడం.... అదీ I.A.S interviews.... బహుశా మాదే First and last occurence అనుకుంటా...... నేను Geography,anthropology mains గా తీసుకున్నా..... ...నా time మంచిదో కాదో తెలియదు కానీ ; మరో జీవి మన మన పొరుగు రాష్త్రపు వాడే .....Senthilkumar(అర్థమయ్యే వుంటుంది... అతనిది తమిళనాడు.) ... అతను కూడా అవే subjects opt చేసుకున్నాడు.... ఇరువురికీ ఒకే marks..... ఇద్దరము ఓపెన్ కాంపిటీషనే ... ఇద్దరమూ I.A.S కే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాము....IFS option కూడా వుంది కానీ , compromise కాలేకున్నాము.చివరి IAS probable,మిగతా services ఉన్నాయి కానీ ....!!! సరే చావో బతుకో తేల్చుకుందామనుకున్నా....చెప్పడం మరచి పోయా... ఇదే నా చివరి అవకాశం... If not IAS...???? నాకు వేరే Services కు వెళ్ళాలని లేదు.. మా నాన్న గారిని కష్ట పెట్ట లేను....సంఘర్షన....!! నేరు గా వెళ్ళి అడిగేద్దామా...Senthil please compromise అని.... ఇంతలొనే నా అలోచన మీద నాకే అసహ్యం వేసింది....!! ఇదేంటి?? అస్సలు ఈ ఆలోచన ఏంటి?? ఐనా ఇది నాకు రావాల్సిన ఆలోచనేనా?? పరి పరి విధాలుగా వెళ్తున్న ఆలోచనలకు Break అన్నట్లు వర్తమానం....Interview room లోకి ఎంట్రీ....ముగ్గురు panel members(neutral jury.-అంటే.. మీరు ఆలోచించినట్లు కాదు.. వేరే రాష్త్రపు వాళ్ళన్నమాట....పక్షపాతం లేకుండేందుకు.......)...వారికి కూడా....ఇలాంటిది కొత్త అనుకుంటా.. !!! Straight గా విషయానికి వచ్చేశారు...(Conversation ఆంగ్లమే సుమా.....)!!!ఆబ్బాయిలూ మీ ఇద్దరూ సమ వుజ్జీలు గా వున్నారు.ఇద్దరూ I.A.S కే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు.... .. ముందుగా ఒక విషయం... మీలో ఎవరన్నా compromise కాదల్చుకుంటే..OK !!!లేకుంటే...రాపిడ్ round తప్పనిసరి...అని మావంక చూసి ,అనుకూల వాయువులు లేవని,confirm చేసుకొని...Interview rules ...చెప్పారు....అదేంటంటే...వారు ఒక ప్రశ్నమాత్రమే అడుగుతారు... ఎవరు ముందు గా చెయ్యి ఎత్తుతారో వారు answer చెయ్యాల్సి వుంటుంది.....ఒక వేళ అతను wrong answer చేసినా లేక మరొక అభ్యర్థి చెయ్యెత్తిన వ్యక్తి కన్నామెరుగైన జవాబు చెప్పినా... చెయ్యెత్తిన అభ్యర్థి...FAIL..!!! అంటే పొరపాటున FAIL ఇతే No..I.A....S....!! సరే కానీ.... ఏమి చెయ్యగలం....ఇంతలోనే...Jury members రెండు చీటీలు తీసి ఒకటి ఎంచుకోమన్నారు...తీరా అవి Subject related chits...ఖర్మకాలి Geography లోనుంచి ప్రశ్న అడగాలని Jury నిర్ణయం... (మనలో మన మాట Geography చాలా vast(not a Waste)...Comaritively with Anthropology.)..Hmm!!! ప్రశ్న అడిగేశారు: నేను అలోచనల నుండి బయట పడేటప్పటి కే.. సెంథిల్ గాడు/గారు చెయ్యెత్తాడు... చాలా చిన్న ప్రశ్న....నేను చెయ్యి ఎందుకు ఎత్తలేకపోయానో..తెలియలేదు...అయిపోయింది... జరగాల్సినదంతా...!!! అడిగిన ప్రశ్న ..."భూ భాగాన్ని ఉష్నోగ్రతల పరంగా ఎన్ని మండలాలుగా విభజించారు?"....
చాలా చిన్న ప్రశ్న... అస్సలు చెప్పాలంటే అది ప్రశ్నే కాదు.మా వూర్లో 3 వ క్లాస్ పిల్లోడిని అడిగినా చెప్పేస్తాడు......
సెంథిల్ ముఖములో విజయ దరహాసము...జవాబు చెప్పసాగాడు...1.శీతల మండలము...2.సమశీతోష్ణ మండలము మరియు 3.ఉష్ణ మండలము...!! ...Right Answer.....Jury అభినందించారు....వాళ్ళ లెక్కలోవో చూసుకుంటున్నారు.... ఈలోపే ఆంధ్ర Brain లో ఒక అవిడియా..తళుక్కున మెరిసింది....అప్రయత్నం గా చెయ్యి పైకి లేచింది....Jury అవాక్కయ్యారో లేదో తెలీదు కానీ.... సెంథిల్ మాత్రం షాక్ అయ్యాడు.....Jury ముఖం లో ఆశ్చర్యం.....Carry on అన్నట్లు...సైగ....Start చేసా సమధానం చెప్పడం.....1.శీతల మండలము...2.సమశీతోష్ణ మండలము 3.ఉష్ణ మండలము మరియు ....కాసేపు 'PAUSE' ఇచ్చా .... అందరి ముఖములో విస్మయం.... చిన్నగా వూపిరి పీల్చుకుని మరలా ...!! చెప్పా...!!! ...!!! 4.చెన్న పట్టణం(తెలియనోళ్ళకు its nothing but CHENNAI).... ఒక్క నిమిషం.... PinDrop silence......Jury members అవాక్కయ్యారు...నా confidence చూసి.. confirmation కోసం Laptop open chesi గూగుల్ లో వెతుకులాడి..30 నిమిషాలు కుస్తీ పట్తి..నా జవాబే మెరుగైనది అన్న కితాబు.. ఇక చూడంది పొగడ్తలే పొగడ్తలు.... నాదే..Best Answer...ఇంకా చదవాలనా....నేనే I.A.S...నేనే I.A.S...నేనే I.A.S....
గమనిక: సెంథిల్ కు ఈచిన్న విషయం ఎందుకు తెలియదు అన్న సందేహం మీకు రావడం సహజమే.. పాపం.. ఇది అతని తప్పు కాదు... వారి వూరు ఊటి....నేనుండేది చెన్న పట్టణము...ఈ గెలుపు చెన్నై కి అంకితం చేస్తూ..మీ ...స్వాప్నికుడు...

11 comments:

Anonymous said...

అంటే మీరు ఇప్ఫుడు అఫీసర్ ఆఆ?

sunnygadu said...

what is the difference b/w all the enlisted temperature zones and specially with chennai?

నాగప్రసాద్ said...

హ హ హ. :).

@sunnygadu గారు, మిగతా వాటికి చెన్నైకి తేడా ఏమిటంటే చెన్నైని ఉష్ణోగ్రత పరంగా అందరూ, hot, hotter, hottest అని జోకులేసుకుంటుంటారు. గత మూడు సంవత్సరాలుగా చెన్నైలో ఉంటున్నాను కాబట్టి, నాకీవిషయం బోధపడింది.

దీన్ని బట్టి చెన్నైని ఉష్ణమండలం అనవచ్చు కదా, అని మీరనవచ్చు. దానికైతే సమాధానం నా దగ్గరలేదు. సమాధానం I.A.S. Officer గారే చెప్పాలి.

నాగప్రసాద్ said...
This comment has been removed by the author.
Anonymous said...

idi joke , serious ga no kuda artham kaledu ..
please explain

Anonymous said...

good joke .. :D but it is misleading some ppl to think that it is a real incident!!

దీన్ని బట్టి చెన్నైని ఉష్ణమండలం అనవచ్చు కదా, అని మీరనవచ్చు>>>
No. Chennai is not "ushnamandalam" ..it is "suryamandalam" :D

వీరుభొట్ల వెంకట గణేష్ said...

హ్మ్మ్ ఎవరక్కడ మా మదరాసు గురించి ఎగతాళీ చేస్తున్నది (:-? ఇక్కడ ఎప్పుడు ఉండేది ఒక రుతువే, అదే గ్రీష్మరుతువు. తుఫాను వస్తేనే వర్షం :)

Hima bindu said...

గుడ్ జోక్ ...ఇంటర్వ్యూ అక్టోబరులో మీకోసం ప్రత్యేకంగా..........

Anonymous said...

He fooled many of us. Did not he? Read the heading. He is a dreamer. All this happened in his dreams and he posted that here. No IAS has ever the time and interest to post all these. He is ridiculing the Chennai weather. There is no such temperature zone as chennai. Pure and silly joke.

మురళి said...

ఒక వేళ ఐఏఎస్ మీ కల ఐతే, మీకు అర్హత, అవకాశం ఉంటే బ్లాగింగ్ మానేసి సీరియస్ గా పరీక్ష మీద దృష్టి పెట్టండి.. అన్నట్టు జోక్ బాగుంది..

...స్వాప్నికుడు... said...

@Ananymous-1: ఆర్యా!! నేను ముందుగానే విన్నవించుకున్నాను.....నేను స్వాప్నికుడను అని....అంటే మీరు ఇప్ఫుడు అఫీసర్ ఆఆ? అని అడిగారు... కానేకాదు....అది ఒకప్పటి కల....ఇప్పటికీ సుమా......!! ధన్యవాదాలు...నా మొదటి టపా చదివినందుకు .....

@SunnyGaadu sorry SunnyGARU:నాగప్రసాద్ గారు కరెక్ట్

@ నాగప్రసాద్ గారు : ZuranCinema గారు కరెక్ట్ -- దీన్నిఉష్ణమండలం అనేదానికన్నా ఒక సూర్యమండలం అనడం కరెక్ట్...
@anonymous-2: Ha Ha Haaaaaaaa... ధన్యవాదాలు...నా మొదటి టపా చదివినందుకు .....

@Zuran Cinema: ధన్యవాదాలు చక్కని విశ్లేషన ... ధన్యవాదాలు

@venkata Ganesh gaaru: మీ మదరాసు కాదండీ .. మన మదరాసు !! హ హ హా ....

@Chinni Gaaru: ధన్యవాదాలు

@Anonymous-3: నిజమే నండి...ఒక వేళ మదరాసులో వుండి వుంటే తెలిసేది....ధన్యవాదాలు

@Murali Garu: "ఒక వేళ ఐఏఎస్ మీ కల ఐతే, మీకు అర్హత, అవకాశం ఉంటే బ్లాగింగ్ మానేసి సీరియస్ గా పరీక్ష మీద దృష్టి పెట్టండి" ...ఈ జన్మ కు ఇలాంటి ప్రోత్సాహం చాలండి.... ఒక రకం గా అర్హత లేదనే చెప్పాలి.....ధన్యవాదాలు...

@ALL: నా చిరు ప్రయత్నాన్ని....సహ్రుదయం తో స్వాగతించినందుకు ధన్యవాదాలు..ఎవ్వరినీ బాధ పెట్టాలనో నా వుద్దేశ్యం కాదు...."As I mentioned Create witty is my mission...." మీ అందరి అభిమానం తో నా ప్రయత్నం సఫలీక్రుతం అవ్వాలని ఆశిస్తూ.... మీ స్వాప్నికుడు... త్వరలోనే మరో టపా లో కలుస్తా...!!