Tuesday, February 1, 2011

అగ్రవర్ణాలతో మా పోరు...సాధించిన విజయం...!!

మమ్మల్ని అణగద్రొక్కిన పెద్దలు....
ఎరుపు --- మొన్నటికి మొన్న ఉల్లిపాయ ధరలు 80;టమోటా ధర ఒకప్పుడు 50 రూ (ఇప్పుడు కూడా)......
పచ్చ---కాప్సికం ధర కిలో కి 55 రూ ;ఆకు కూర ఒక కట్టకు 10 నుంచి 15 రూపాయలు...
నీలం -- వంకాయలు కిలో 45 రూ నుంచి 50 రూ వరకు.......
ఎమిటీ అన్యాయం....ఈ అగ్ర వర్ణాల అభిజాత్యం....ఏం మేమేమీ కాయగూరలం కాదా?? మాకు చక్కని రంగులు లేవా? మాలో పోషక విలువలు లేవా?? మేం చేసిన అన్యాయం ఏమి?? ఇలా ఆలోచించి చించి చించి
ఈ అగ్రవర్ణ కుట్రకు చరమ గీతం పాడాలని...ఒక నిర్ణయానికి వచ్చి .. మేము కూడా బంద్ లు పాటించి, థర్నాలు చేసి అందరినీ ఇబ్బందులు పెట్టేలా ....మాకు అత్యధిక ధరలను ఆపాదించుకున్నాం,సాధించుకున్నాం....ఈ పోరులో విజయాన్ని సాధించాం.....ఇప్పుడు కూరల దుకాణాలలో ఒక కిలో మమ్మల్ని కొంటే ఒక బంగారు నాణెం ఉచితం అని ఎర చూపేవిధం గా సాధికారితను చేకూర్చుకున్నాం....ఈ విజయాన్ని అగ్రవర్ణాల అభిజాత్యం పూర్తిగా నశించేవరకు కొనసాగించాలని ఏకగ్రీవం గా తీర్మానించుకున్నాం....
ఇట్లు
శ్వేత వర్ణం --- ముల్లంగి కిలో 40 నుంచి 45 రూ (ప్రస్తుతం)
కాషాయం ---- కారట్ 80 నుంచి 90 రూ కిలోకి./...(నేనూ ప్రస్తుతమే...)
లేత పచ్చ --- క్యాబేజి కిలో 45 రూ రమారమి....(డిటో ) హా ఇలా చెప్పుకుంటూ పొతే ఈ పేజ్ చాలదు కానీ .... మేమంతా పై మూడు ప్రాథమిక వర్ణాలు కానివాళ్ళం.... ధరల విషయం లో కడు గొప్పవాళ్ళం....

**ఉపసంహారం: ఇక్కడ వర్ణం = రంగు
ప్రాథమిక రంగులు/ ప్రైమరీ కలర్స్ అయిన Red Green Blue (RGB)లను అగ్ర వర్ణాలు గా తీసుకోబడ్డాయి......
*నీలి రంగుకు నీలి వంకాయ అనుకోండి....హి హి హీ....
****సరదాకు మాత్రమే....