Wednesday, October 27, 2010

భాజీవ్ ది లివింగ్ లెజెండ్ తుగ్లక్...

గమనిక: టపాలో లాజిక్ కి తావు లేదు....

మన "రోయ్య" గాడికి క్షమించాలి "గారికి" ... అమ్రీక నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది... అది సన్మానం తాలూక కాల్ ...తనకు అమ్రీక ప్రభుత్వం ఇవ్వబోయే అవార్డ్ ... ఇప్పటి వరకు బతికి వుండగా పొందిన వారు లేరు.... గర్వం తో తన ఛాతీ వుప్పొంగింది ... ఇంతలో మన అప్రధాని నుంచి అభినందన కాల్ ... ఇది ఒక లెక్కలోనిది కాకపొయినా తరువాత కాల్ తనను చాలా ప్రభావితం చేసింది ; అది తన దైవం అమ్మ "సానియమ్మ" నుంచి వచ్చిన కాల్... ఇక మురిసిపోయాడు మన హీరో.... త్వరగా వెళ్ళాలి అందుకోవాలి....విజయాన్ని తన ప్రియతమ "భాజీవ్" కి అంకితం చెయ్యాలి.... ఇంతలో ఎవ్వరో అమ్రీకలో కీళ్ళ నొప్పులకు మాంచి మందు దొరుకుద్ది అని అనగా విని ఆహా ఒక దెబ్బకి రెండు పిట్టలు అవార్డ్ తో బాటు మన మెదడుని కాపాడుకోవచ్చు అని హుటా హుటిన "భాజీవ్"అంతర్జాతీయ విమానాశ్రయం లో "భాజీవ్" ఇండియన్ యైర్ లైన్స్ లో ఎక్కి "భాజీవ్" ఫ్లయింగ్ జోన్ మీదుగా అమ్రీక వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు ; "భాజీవ్" సడక్ యోజన రోడ్ పై "భాహుల్"అంబాసిడర్ కార్ ఎక్కి వేగం గా వెళ్ళు అని వాళ్ళ డ్రైవర్ "భాజీవ్" సుబ్బయ్యను పురమాయించాడు...

వెంటనే ప్రయాణం ....ముష్టి వాడు తలుచుకుంటే కూరలకి కొదువా??

అలా మురికి వీధులలో "భింధిరా" నీఛాస్ ఇళ్ళు చూసుకుంటూ "భాజీవ్" సడక్ యోజన రోడ్ పై వెళ్తుంటే మన "రోయ్య" గాడి కి చిన్న నాటి తీపి గుర్తులు అలా అలా మనస్సులో మెదిలాయి ..

అది 55-60 సంవత్సరాల ముందు మాట ... అప్పుడు తను 8 వతరగతి ....వాళ్ళ సోషల్ మాస్టర్ అడిగిన ప్రశ్న మీకు నచ్చిన గొప్పగా చరిత్రలో మిగిలన వ్యక్తి ఎవ్వరు....అని .... క్లాస్ లో ఒక్కొక్కరు ఒక్కొ సమాధానం ఒకరు అశోకుడు అంటే మరొకడు చంద్రగుప్తుడు మరొకరు శివాజీ ఇలా చెప్తున్నారు... తన వంతు వచ్చింది... తన సమాధానం కోసం అధ్యాపకులు ఎక్కువ ఉత్సాహం గా వున్నారు కారణం "రోయ్య" గాడు పుట్టుకతోనే తింగరి .... తను చెప్పిన సమాధానం "తుగ్లక్ -- మహమ్మద్ బీన్ తుగ్లక్" ...అంతే వాళ్ళ మాస్టర్ గారు ఆనందం తో దీవించాడు నువ్వు కూడా అలాగే చరిత్రలో మిగులుతావ్ అని...

ఇంతలో తన మధుర స్మృతులకు ఆటంకమా అనిపించే విధం గా ఒక్క కుదుపు దానితో పాటు దుర్గంధం....ఏందిరా "భాజీవ్" సుబ్బిగా ఏమయింది.... ఏముంది సార్ మన రోడ్ ఇంతేగా... ! ఓకే ఓకే మరి కంపు?? సార్ , మరి మన "భాజీవ్" హుస్సేన్ సాగర్ గాలి...దీని పేరు మార్చినప్పటినుంచి కంపు ఎక్కువయ్యింది ...సుబ్బి గాడి సమాధానం,
ఏయ్ ఏమిటి పొగరు సమాధానం ..నన్ను ఎమన్నా అను ... కానీ "భాజీవ్" పేరుని ఏమన్న అంటె అంతే...జాగ్రత్త.... అని గద్దించాదు...మన హిరో ......"భాజీవ్" సుబ్బి గాడు కిమ్మనకుండా వున్నాడు...


అలా ప్రారంభమైన ప్రహసనం అమ్రీక వరకు కొనసాగింది...దారిలో ఎన్నొ అను"భూతులు" ......అమ్రీకాలో ఇచ్చే అవార్డ్ పై ఎన్నెన్నో ఊహలు.....ఉక్కిరి బిక్కిరి అవుతూ సాగిన ప్రయాణం... ...


కలా నిజమా అని నమ్మలేని విధం గా తీర్చి దిద్దిన స్టేజ్ పైన ఆహ్వానితుడై వున్నాడు .... జూరి సభ్యులు అవార్డ్ పేరు ముందుగా బయటకు చెప్పనందు వల్ల ప్రపంచ వ్యాప్తం గా ఉత్కంఠత నెలకొని ఉన్నది... మన జీరో పరిస్థితి చెప్పనవసరం లేదు అనుకుంటా....మొదులే మోకాళ్ళ నొప్పి వల్ల మెదడు కి కొంచెం శ్రమ ఎక్కువయ్యింది కదా అందుకే ఉత్కంఠ తట్టుకోలేకుండా వున్నాడు...

జూరి సభ్యులు విషయం గమనించి అవార్డ్ పేరు బయటకు చెప్పారు ...దాని పెరే "ది లివింగ్ లెజెండ్ తుగ్లక్" ......,,, ఒక్క సారి సభా స్థలి అంతా కరతాళ ధ్వనులతో మారు మ్రోగిపోయింది...మన జీరో గాడు పైకి లేచి నాకు అవార్డ్ వద్దు అని బయటకు వెళ్ళబోగా ... ప్రపంచం నివ్వెర పోయింది....జూరి సభ్యులు గతుక్కు మన్నారు...
ఎలాగో లా జూరి సభ్యులు మన జీరో కి అవార్డ్ కట్టబెట్టి తమ పెతాపాన్ని ప్రపంచానికి చూపించాలని అనుకొని.... మన "రోయ్య" గాడితో మంతనాలు స్టేజ్ పైనే జరిపి చివరగా చిరునవ్వుతో సభనుద్దేశ్యించి ఇలా అన్నారు .. మన "రోయ్య" గారికి అవార్డ్ నచ్చలేక తీసుకోవడం కాదు... పేరు నచ్చకపోవడం వల్ల... అందుకే అవార్డ్ పేరు మార్చి ఇవ్వాలని అనుకుంటున్నాం... దాని పేరే "భాజీవ్ ది లివింగ్ లెజెండ్ తుగ్లక్"....ఇంకేంటి మన హీరో కళ్ళలో అనందం ....తన అధ్యాపకుల వారి దీవెన విధం గా ఫలించింది.... ....(కుంక అది దీవెన అని అనుకున్నాడు....)
చెప్పడం మరిచిపోయానండోయ్.. మన హీరో అస్సలు పేరు... "భాజీవ్ రోయ్య.."

* ఎవరన్నా తుగ్లక్ అభిమానులకు కష్టం కలిగి వారి మనోభావాలు దెబ్బతిని ఉంటే... క్షమించండి...
**** సరదాకు మాత్రం కాదు....ఏమీ పీకలేక ఇలా.....