Wednesday, October 21, 2009

నా వయస్సు....ఒక రహస్యం...

అది ఒక శుక్రవారపు సాయం సంధ్యా సమయం...ఒక నిర్జలమైన జీవ నదీ తీరం( నిర్జలమైన జీవ నదీ తీరం: ఏదో పదం కొత్తగుందని వాడలేదు....జలం లేక జీవనది ఏంటని అలోచించ వద్దు...మా నదిని చూస్తే మీకే తెలుస్తుంది....నీరులేక పోయినా జీవ కళ... నిజమే..మంచి రంగులో వుండే ఇసుక..గట్టు మీద వుండే రాగి చెట్టు మీద చిలుకలు చేసే సందడి... పిల్లలు అందరూ చేరి హాయి గా అడుకునే విధానం చల్లని గ్రామ దేవత చెంత పొంగళ్ళు పెట్టుకొనే అమ్మల అత్మీయత ....హ్మ్మ్ ఇలా చెప్పాలంటే మరో టపా పెట్టాల్సిందే....)..నాకు చాలా ఇష్టమైన సాయంత్రం.. హాయి గా ఒక పక్క ఇసుకలో పండుకోని తీయని వూహల మధ్య విహారం చేస్తూ....మరో వైపు పిల్లల అనందపు కేకల ను అనుభవిస్థూ... నా బాల్యం గురు చేసుకుంటూ...అధ్బుత లోకాల లో విహరిస్తూ వుండగా ...నా లోకం లో నుంచి బయటకు వచ్చేలా పేద్ద కలకరం .... అయిష్టం గా అయినా లేయక తప్పలేదు....చూద్దును కదా....ఒక అద్భుతమైన ఘట్టం... గ్రామ దేవత చెంత పొంగళ్ళు పెట్టుకొనే అమ్మలు అందరూ చేతులు జోడించి ఒకావిడకు అభివాదాలు చేస్తున్నారు....అద్భుతమైన ఘట్టం అని ఎందుకు అన్నానంటే,మామూలుగా ఆ సమయం లో ఎవ్వరికీ అలా నమస్కరించరు ఒక్క దేవతకు తప్ప....ఎంటో ఆవిడ విశేషం అనుకుంటూ..పక్కన వుండే వారిని అడగాలని అనుకొని తిరిగి చూశా... ఎవ్వరూ లేరు అందరూ పరుగున అవిడ గారికి దగ్గరగా వెళ్ళి మొక్కుతున్నారు...ఆ పరుగెత్తే విధానం లో రేగిన దుమ్ము లో ఆవిడ రూపం స్పష్టం గా కనిపించటం లేదు...కొంతసేపటికి కొంచెం దుమ్ము తగ్గగానే అస్పష్టం గా కనిపించింది ఆవిడ..(దుమ్ము తగ్గితే అస్పష్టం ఎందుకంటారా ? నా సులోచనాలను ఇంటిదగ్గరే మరచా) పచ్చ,నీలం కలిగిన పట్టు చీరలో అధ్బుతమైన సౌందర్యం తో వుంది....ఎవరీవిడ ?వయస్సు ఎంతుంటుందో... అందరూ ఎందుకు మొక్కుతున్నారు? ఇలా రకరకాలైన ప్రశ్నల మధ్య సతమౌతూ..వెళ్ళి తననే అడగాలని నిశ్చయించుకోని బయలు దేరుదామనుకున్నా... ఇంతలొనే నా మనస్సు తెలిసిన దానిలా ఆవిడే నా వైపు రాసాగింది ... అలా దగ్గరౌతున్న కొద్దీ స్పష్టత పెరగసాగింది... అద్భుత సౌందర్యం తో బాటు అవిడ ముఖం లోని ప్రశాంతత, ప్రేమను పంచే చల్లని చూపులు,అమ్మను తలపిస్తున్నాయి.... ఆవిడ నేరుగా నాదగ్గరకు వచ్చి "అన్నా" క్షేమమా అని క్షేమ సమాచారం అడిగి, భక్తులు తనకు సమర్పించిన పండ్లు నా చేతిలో వుంచి...జవాబు చెప్పేలొపే తన దారిన తను వెళ్ళి పోయింది....ఇంతకీ ఎవరీవిడ అని పక్కనే ఆరాధన గా చుస్తున్న వారిని అడిగా....వాళ్ళ సమాధానం విని ఖంగు తిన్నా .... అన్నా - ఆవిడ "భూమాత".... ##@@((&% !! అన్నట్టు అడగడం మరచా... నా వయస్సు రహస్యం తెలిసిందా....????....

ఉప సం హారం: మా వూర్లో వయస్సు అయిపపోయింది అని వెటకారం చెసేదానికి "ఓ వాడు భూమికి ముందు పుట్టినోడు రా అంటారు... " ఈ వెటకారం ఆధారం గా చిరు ప్రయతమే ఈ టపా.... ఎవ్వరి అభిప్రాయలనూ కించ పరచే వుద్దేశ్యం ఏ మాత్రం లేదు ... గమనించ మనవి....