Tuesday, February 1, 2011

అగ్రవర్ణాలతో మా పోరు...సాధించిన విజయం...!!

మమ్మల్ని అణగద్రొక్కిన పెద్దలు....
ఎరుపు --- మొన్నటికి మొన్న ఉల్లిపాయ ధరలు 80;టమోటా ధర ఒకప్పుడు 50 రూ (ఇప్పుడు కూడా)......
పచ్చ---కాప్సికం ధర కిలో కి 55 రూ ;ఆకు కూర ఒక కట్టకు 10 నుంచి 15 రూపాయలు...
నీలం -- వంకాయలు కిలో 45 రూ నుంచి 50 రూ వరకు.......
ఎమిటీ అన్యాయం....ఈ అగ్ర వర్ణాల అభిజాత్యం....ఏం మేమేమీ కాయగూరలం కాదా?? మాకు చక్కని రంగులు లేవా? మాలో పోషక విలువలు లేవా?? మేం చేసిన అన్యాయం ఏమి?? ఇలా ఆలోచించి చించి చించి
ఈ అగ్రవర్ణ కుట్రకు చరమ గీతం పాడాలని...ఒక నిర్ణయానికి వచ్చి .. మేము కూడా బంద్ లు పాటించి, థర్నాలు చేసి అందరినీ ఇబ్బందులు పెట్టేలా ....మాకు అత్యధిక ధరలను ఆపాదించుకున్నాం,సాధించుకున్నాం....ఈ పోరులో విజయాన్ని సాధించాం.....ఇప్పుడు కూరల దుకాణాలలో ఒక కిలో మమ్మల్ని కొంటే ఒక బంగారు నాణెం ఉచితం అని ఎర చూపేవిధం గా సాధికారితను చేకూర్చుకున్నాం....ఈ విజయాన్ని అగ్రవర్ణాల అభిజాత్యం పూర్తిగా నశించేవరకు కొనసాగించాలని ఏకగ్రీవం గా తీర్మానించుకున్నాం....
ఇట్లు
శ్వేత వర్ణం --- ముల్లంగి కిలో 40 నుంచి 45 రూ (ప్రస్తుతం)
కాషాయం ---- కారట్ 80 నుంచి 90 రూ కిలోకి./...(నేనూ ప్రస్తుతమే...)
లేత పచ్చ --- క్యాబేజి కిలో 45 రూ రమారమి....(డిటో ) హా ఇలా చెప్పుకుంటూ పొతే ఈ పేజ్ చాలదు కానీ .... మేమంతా పై మూడు ప్రాథమిక వర్ణాలు కానివాళ్ళం.... ధరల విషయం లో కడు గొప్పవాళ్ళం....

**ఉపసంహారం: ఇక్కడ వర్ణం = రంగు
ప్రాథమిక రంగులు/ ప్రైమరీ కలర్స్ అయిన Red Green Blue (RGB)లను అగ్ర వర్ణాలు గా తీసుకోబడ్డాయి......
*నీలి రంగుకు నీలి వంకాయ అనుకోండి....హి హి హీ....
****సరదాకు మాత్రమే....

Monday, November 8, 2010

జడ్.నో.కడ్డీ ...... నామా...చిరునామా...!!

నమూనా వివాహ ఆహ్వాన పత్రిక......

పాత చిరునామా:
శ్రీ వేంకటేశ్వర కళ్యాణ మంటపం, నం. 223, 4 వ వార్డ్, శివాలయం వీధి,(శ్రీ విద్య బస్ స్టాప్ దగ్గర), సింహం వెందుల, దేవుని కడప జిల్లా , ఆంధ్రప్రదేశ్.


కొత్త చిరునామా:
భాజీవ్ వెంకటేశ్వర కల్యాణ మంటపం, నం.223, 4 జడ్.నో.కడ్డీ శిలా విగ్రహాల కూడలి, ధ్యాన ముద్రలో వుండే జడ్.నో.కడ్డీ శిలా విగ్రహం వీధి, ఆరు జడ్.కడ్డీ విగ్రహాల వీధి పక్కన ,భారీ జడ్.నో.కడ్డీ విగ్రహం బస్ స్టాప్(అపర భగీరథుని విగ్రహం వెనకాల ), జడ్.నో.కడ్డీ సింహం వెందుల, జడ్.నో.కడ్డీ గడప జిల్లా...ఆంధ్రప్రదేశ్.

**సరదా కు మాత్రమే..మీరు జడ్ బదులు వై అని ..నో బదులు యస్ అని , కడ్డీ బదులు రెడ్డి అని మార్చుకుంటే జరిగే విపరీతాలకు నేను భాధ్యుడను కాను....

Wednesday, October 27, 2010

భాజీవ్ ది లివింగ్ లెజెండ్ తుగ్లక్...

గమనిక: టపాలో లాజిక్ కి తావు లేదు....

మన "రోయ్య" గాడికి క్షమించాలి "గారికి" ... అమ్రీక నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది... అది సన్మానం తాలూక కాల్ ...తనకు అమ్రీక ప్రభుత్వం ఇవ్వబోయే అవార్డ్ ... ఇప్పటి వరకు బతికి వుండగా పొందిన వారు లేరు.... గర్వం తో తన ఛాతీ వుప్పొంగింది ... ఇంతలో మన అప్రధాని నుంచి అభినందన కాల్ ... ఇది ఒక లెక్కలోనిది కాకపొయినా తరువాత కాల్ తనను చాలా ప్రభావితం చేసింది ; అది తన దైవం అమ్మ "సానియమ్మ" నుంచి వచ్చిన కాల్... ఇక మురిసిపోయాడు మన హీరో.... త్వరగా వెళ్ళాలి అందుకోవాలి....విజయాన్ని తన ప్రియతమ "భాజీవ్" కి అంకితం చెయ్యాలి.... ఇంతలో ఎవ్వరో అమ్రీకలో కీళ్ళ నొప్పులకు మాంచి మందు దొరుకుద్ది అని అనగా విని ఆహా ఒక దెబ్బకి రెండు పిట్టలు అవార్డ్ తో బాటు మన మెదడుని కాపాడుకోవచ్చు అని హుటా హుటిన "భాజీవ్"అంతర్జాతీయ విమానాశ్రయం లో "భాజీవ్" ఇండియన్ యైర్ లైన్స్ లో ఎక్కి "భాజీవ్" ఫ్లయింగ్ జోన్ మీదుగా అమ్రీక వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు ; "భాజీవ్" సడక్ యోజన రోడ్ పై "భాహుల్"అంబాసిడర్ కార్ ఎక్కి వేగం గా వెళ్ళు అని వాళ్ళ డ్రైవర్ "భాజీవ్" సుబ్బయ్యను పురమాయించాడు...

వెంటనే ప్రయాణం ....ముష్టి వాడు తలుచుకుంటే కూరలకి కొదువా??

అలా మురికి వీధులలో "భింధిరా" నీఛాస్ ఇళ్ళు చూసుకుంటూ "భాజీవ్" సడక్ యోజన రోడ్ పై వెళ్తుంటే మన "రోయ్య" గాడి కి చిన్న నాటి తీపి గుర్తులు అలా అలా మనస్సులో మెదిలాయి ..

అది 55-60 సంవత్సరాల ముందు మాట ... అప్పుడు తను 8 వతరగతి ....వాళ్ళ సోషల్ మాస్టర్ అడిగిన ప్రశ్న మీకు నచ్చిన గొప్పగా చరిత్రలో మిగిలన వ్యక్తి ఎవ్వరు....అని .... క్లాస్ లో ఒక్కొక్కరు ఒక్కొ సమాధానం ఒకరు అశోకుడు అంటే మరొకడు చంద్రగుప్తుడు మరొకరు శివాజీ ఇలా చెప్తున్నారు... తన వంతు వచ్చింది... తన సమాధానం కోసం అధ్యాపకులు ఎక్కువ ఉత్సాహం గా వున్నారు కారణం "రోయ్య" గాడు పుట్టుకతోనే తింగరి .... తను చెప్పిన సమాధానం "తుగ్లక్ -- మహమ్మద్ బీన్ తుగ్లక్" ...అంతే వాళ్ళ మాస్టర్ గారు ఆనందం తో దీవించాడు నువ్వు కూడా అలాగే చరిత్రలో మిగులుతావ్ అని...

ఇంతలో తన మధుర స్మృతులకు ఆటంకమా అనిపించే విధం గా ఒక్క కుదుపు దానితో పాటు దుర్గంధం....ఏందిరా "భాజీవ్" సుబ్బిగా ఏమయింది.... ఏముంది సార్ మన రోడ్ ఇంతేగా... ! ఓకే ఓకే మరి కంపు?? సార్ , మరి మన "భాజీవ్" హుస్సేన్ సాగర్ గాలి...దీని పేరు మార్చినప్పటినుంచి కంపు ఎక్కువయ్యింది ...సుబ్బి గాడి సమాధానం,
ఏయ్ ఏమిటి పొగరు సమాధానం ..నన్ను ఎమన్నా అను ... కానీ "భాజీవ్" పేరుని ఏమన్న అంటె అంతే...జాగ్రత్త.... అని గద్దించాదు...మన హిరో ......"భాజీవ్" సుబ్బి గాడు కిమ్మనకుండా వున్నాడు...


అలా ప్రారంభమైన ప్రహసనం అమ్రీక వరకు కొనసాగింది...దారిలో ఎన్నొ అను"భూతులు" ......అమ్రీకాలో ఇచ్చే అవార్డ్ పై ఎన్నెన్నో ఊహలు.....ఉక్కిరి బిక్కిరి అవుతూ సాగిన ప్రయాణం... ...


కలా నిజమా అని నమ్మలేని విధం గా తీర్చి దిద్దిన స్టేజ్ పైన ఆహ్వానితుడై వున్నాడు .... జూరి సభ్యులు అవార్డ్ పేరు ముందుగా బయటకు చెప్పనందు వల్ల ప్రపంచ వ్యాప్తం గా ఉత్కంఠత నెలకొని ఉన్నది... మన జీరో పరిస్థితి చెప్పనవసరం లేదు అనుకుంటా....మొదులే మోకాళ్ళ నొప్పి వల్ల మెదడు కి కొంచెం శ్రమ ఎక్కువయ్యింది కదా అందుకే ఉత్కంఠ తట్టుకోలేకుండా వున్నాడు...

జూరి సభ్యులు విషయం గమనించి అవార్డ్ పేరు బయటకు చెప్పారు ...దాని పెరే "ది లివింగ్ లెజెండ్ తుగ్లక్" ......,,, ఒక్క సారి సభా స్థలి అంతా కరతాళ ధ్వనులతో మారు మ్రోగిపోయింది...మన జీరో గాడు పైకి లేచి నాకు అవార్డ్ వద్దు అని బయటకు వెళ్ళబోగా ... ప్రపంచం నివ్వెర పోయింది....జూరి సభ్యులు గతుక్కు మన్నారు...
ఎలాగో లా జూరి సభ్యులు మన జీరో కి అవార్డ్ కట్టబెట్టి తమ పెతాపాన్ని ప్రపంచానికి చూపించాలని అనుకొని.... మన "రోయ్య" గాడితో మంతనాలు స్టేజ్ పైనే జరిపి చివరగా చిరునవ్వుతో సభనుద్దేశ్యించి ఇలా అన్నారు .. మన "రోయ్య" గారికి అవార్డ్ నచ్చలేక తీసుకోవడం కాదు... పేరు నచ్చకపోవడం వల్ల... అందుకే అవార్డ్ పేరు మార్చి ఇవ్వాలని అనుకుంటున్నాం... దాని పేరే "భాజీవ్ ది లివింగ్ లెజెండ్ తుగ్లక్"....ఇంకేంటి మన హీరో కళ్ళలో అనందం ....తన అధ్యాపకుల వారి దీవెన విధం గా ఫలించింది.... ....(కుంక అది దీవెన అని అనుకున్నాడు....)
చెప్పడం మరిచిపోయానండోయ్.. మన హీరో అస్సలు పేరు... "భాజీవ్ రోయ్య.."

* ఎవరన్నా తుగ్లక్ అభిమానులకు కష్టం కలిగి వారి మనోభావాలు దెబ్బతిని ఉంటే... క్షమించండి...
**** సరదాకు మాత్రం కాదు....ఏమీ పీకలేక ఇలా.....

Thursday, June 3, 2010

తర్జుమా దాని శిఖరం పైన...

1.Youtube = నీ గొట్టం / తమరి గొట్టం
2.WWW = ప్రపంచ వ్యాప్తపు సాలెగూడు
3.Deadlock = చచ్చిన తాళము
4.BUG = నల్లి
5.Facebook = ముఖ పుస్తకము
6.Server Crash = వడ్డించేవాడు గుద్దుకున్నాడు
7.Internet = లోపలి వల
8.Hack = కోసెయ్
మీరూ మొదలెట్టండి...తమాషా తర్జుమా ... ఇంతకీ Title అర్ఠమయ్యిందా....?? Translation at its peak... హ హ హా

**సరదాకు మాత్రమే....

Thursday, May 20, 2010

తెలుగు పడతులకు తీరని అవమానం......

ఆన్యాయం...అక్రమం...దుర్మార్గం...దుష్క్రుత్యం,అఘాయిత్యం... చివరిగా తీరని అవమానం.....

ఏం? మనకు వాతావరణ కేంద్రాలు లేవా?? వాతావరణ పరిశోధకులు లేరా?

పెట్టేందుకు ఒక్క పేరుకూడా మనది దొరకలేదా?

అలజడి స్రుష్టిస్తోంది మన తీరం పేర్లు మాత్రం పరాయివా??

ఏం ఎందుకింత చిన్న చూపు? అందుకే డిమాండ్ చేస్తున్నా...
ఇక ఎక్కడ తుఫాన్ ఏర్పడితే అది ఏర్పడ్డ ప్రదేశానికి అనుగుణం గా పేర్లు పెట్టాలి... మన ఆడపడచుల అహం దెబ్బ తినకూడదు....
అందుకే ఇక నుంచి ఇలాంటి పేర్లు పెట్టేలా డిమాండ్...


లైలా పేరును తక్షణమే మార్చి పదహారణాల తెలుగు పేరు పెట్టాలి....
ఆ పేరు క్రింది వాటిలొ ఎదో ఒకతి ఐతే నేటివిటీ బాగుంటుంది అని నా అభిప్రాయము...
ఉదా:-
1.పుల్లమ్మ
2.వెంకమ్మ
3.సుబ్బమ్మ
4.పిచ్చమ్మ
5.మంగమ్మ
6.రాజమ్మ

చెప్పాగా ఇవి ఉదాహరణలేనని... తరువాత వారి ఇష్టం ....ఇతే నేటివిటీ దగ్గర మాత్రం నో కాంప్రమైస్...

ఇందుమూలంగా పనిలో పని గా "నాగపట్టణం" లో తుఫాన్ లకు తమిళ్ పేర్లు పెట్టాలని నా డిమాండ్ ...
ఉదాహరణలుగా
1.పొర్సెల్వి
2.మయిలమ్మ
3.పచ్చియమ్మ
4.కలైసెల్వి
5.కన్మణి .........

నా డిమాండ్ అంగీకరించకపొతే వాతవరణ శాఖ మొత్తం లైలా లొ కొట్టు కు పోయేలా శపిస్తా... క్షమించండి "మంగమ్మలో" మొత్తుకుపోయేలా శపిస్తా....

**సరదాకు మాత్రమే.....

Friday, February 26, 2010

సచిన్ కన్నా మా "ధోనీ " యే మాకు గొప్ప....

ఏంటి సచిన్ 200 నాట్ అవుట్ అదేమంత గొప్ప విషయమా....??

అదే మా ధోనీ గాడు చూడండి....

5 రోజులు ...
400 + అవుట్స్... (మేము రన్స్ అనుకుంటాము )

రోజుకు సగటున 80+.... ఇంకా సాలిడ్ కంట్రోల్ ....

రాజీ లేని బాటింగ్ ప్రతిభ... మాకు చాలా సుఖవంతమైన నిద్ర ....

ప్రతిభను పొగడకుండా మీ కుళ్ళేంటండీ బాబు....
నిజం గా ఇదంతా మా "ధొనీ" గాడి మహిమే.....

ఇంతకీ మా ధొనీ ని చుశారా? (చూడకుంటే ఎందుకాలశ్యం ఓ లుక్కేయండి... )
.
.
.
.




ముద్దు గా కాదు మొద్దు గా పెట్టుకున్నా నా దోమల బాట్ కి ఈ పేరు ... అంతే...

**సరదాకు మాత్రమే ;

Friday, January 29, 2010

రంగుల్లో "కెలుకుతా" ఒక్క సారి కాదు పది సార్లు....

కెలుకుతా కెలుకుతా కెలుకుతా కెలుకుతా కెలుకుతా కెలుకుతా కెలుకుతా
కెలుకుతా కెలుకుతా

***అబ్బో లెక్కేశారే... తొమ్మిది వున్నాయంటూ గొడవ కి రావొద్దు..మిగిలిన ఒక్కటీ టైటిల్ లో వుంది గా.... హా..