Wednesday, October 21, 2009

నా వయస్సు....ఒక రహస్యం...

అది ఒక శుక్రవారపు సాయం సంధ్యా సమయం...ఒక నిర్జలమైన జీవ నదీ తీరం( నిర్జలమైన జీవ నదీ తీరం: ఏదో పదం కొత్తగుందని వాడలేదు....జలం లేక జీవనది ఏంటని అలోచించ వద్దు...మా నదిని చూస్తే మీకే తెలుస్తుంది....నీరులేక పోయినా జీవ కళ... నిజమే..మంచి రంగులో వుండే ఇసుక..గట్టు మీద వుండే రాగి చెట్టు మీద చిలుకలు చేసే సందడి... పిల్లలు అందరూ చేరి హాయి గా అడుకునే విధానం చల్లని గ్రామ దేవత చెంత పొంగళ్ళు పెట్టుకొనే అమ్మల అత్మీయత ....హ్మ్మ్ ఇలా చెప్పాలంటే మరో టపా పెట్టాల్సిందే....)..నాకు చాలా ఇష్టమైన సాయంత్రం.. హాయి గా ఒక పక్క ఇసుకలో పండుకోని తీయని వూహల మధ్య విహారం చేస్తూ....మరో వైపు పిల్లల అనందపు కేకల ను అనుభవిస్థూ... నా బాల్యం గురు చేసుకుంటూ...అధ్బుత లోకాల లో విహరిస్తూ వుండగా ...నా లోకం లో నుంచి బయటకు వచ్చేలా పేద్ద కలకరం .... అయిష్టం గా అయినా లేయక తప్పలేదు....చూద్దును కదా....ఒక అద్భుతమైన ఘట్టం... గ్రామ దేవత చెంత పొంగళ్ళు పెట్టుకొనే అమ్మలు అందరూ చేతులు జోడించి ఒకావిడకు అభివాదాలు చేస్తున్నారు....అద్భుతమైన ఘట్టం అని ఎందుకు అన్నానంటే,మామూలుగా ఆ సమయం లో ఎవ్వరికీ అలా నమస్కరించరు ఒక్క దేవతకు తప్ప....ఎంటో ఆవిడ విశేషం అనుకుంటూ..పక్కన వుండే వారిని అడగాలని అనుకొని తిరిగి చూశా... ఎవ్వరూ లేరు అందరూ పరుగున అవిడ గారికి దగ్గరగా వెళ్ళి మొక్కుతున్నారు...ఆ పరుగెత్తే విధానం లో రేగిన దుమ్ము లో ఆవిడ రూపం స్పష్టం గా కనిపించటం లేదు...కొంతసేపటికి కొంచెం దుమ్ము తగ్గగానే అస్పష్టం గా కనిపించింది ఆవిడ..(దుమ్ము తగ్గితే అస్పష్టం ఎందుకంటారా ? నా సులోచనాలను ఇంటిదగ్గరే మరచా) పచ్చ,నీలం కలిగిన పట్టు చీరలో అధ్బుతమైన సౌందర్యం తో వుంది....ఎవరీవిడ ?వయస్సు ఎంతుంటుందో... అందరూ ఎందుకు మొక్కుతున్నారు? ఇలా రకరకాలైన ప్రశ్నల మధ్య సతమౌతూ..వెళ్ళి తననే అడగాలని నిశ్చయించుకోని బయలు దేరుదామనుకున్నా... ఇంతలొనే నా మనస్సు తెలిసిన దానిలా ఆవిడే నా వైపు రాసాగింది ... అలా దగ్గరౌతున్న కొద్దీ స్పష్టత పెరగసాగింది... అద్భుత సౌందర్యం తో బాటు అవిడ ముఖం లోని ప్రశాంతత, ప్రేమను పంచే చల్లని చూపులు,అమ్మను తలపిస్తున్నాయి.... ఆవిడ నేరుగా నాదగ్గరకు వచ్చి "అన్నా" క్షేమమా అని క్షేమ సమాచారం అడిగి, భక్తులు తనకు సమర్పించిన పండ్లు నా చేతిలో వుంచి...జవాబు చెప్పేలొపే తన దారిన తను వెళ్ళి పోయింది....ఇంతకీ ఎవరీవిడ అని పక్కనే ఆరాధన గా చుస్తున్న వారిని అడిగా....వాళ్ళ సమాధానం విని ఖంగు తిన్నా .... అన్నా - ఆవిడ "భూమాత".... ##@@((&% !! అన్నట్టు అడగడం మరచా... నా వయస్సు రహస్యం తెలిసిందా....????....

ఉప సం హారం: మా వూర్లో వయస్సు అయిపపోయింది అని వెటకారం చెసేదానికి "ఓ వాడు భూమికి ముందు పుట్టినోడు రా అంటారు... " ఈ వెటకారం ఆధారం గా చిరు ప్రయతమే ఈ టపా.... ఎవ్వరి అభిప్రాయలనూ కించ పరచే వుద్దేశ్యం ఏ మాత్రం లేదు ... గమనించ మనవి....

Thursday, September 24, 2009

నా I.A.S ఇంటర్వ్యూ ..

అది 27-Oct-2007 ....ఇండియన్ హిస్టరీ లోనే ఒక మరుపు రాని ఒక గొప్ప కీలక ఘట్టం...ఒకే సారి ఇద్దరి candidates ను ఇలా ఇంటర్వ్యూ చెయ్యడం.... అదీ I.A.S interviews.... బహుశా మాదే First and last occurence అనుకుంటా...... నేను Geography,anthropology mains గా తీసుకున్నా..... ...నా time మంచిదో కాదో తెలియదు కానీ ; మరో జీవి మన మన పొరుగు రాష్త్రపు వాడే .....Senthilkumar(అర్థమయ్యే వుంటుంది... అతనిది తమిళనాడు.) ... అతను కూడా అవే subjects opt చేసుకున్నాడు.... ఇరువురికీ ఒకే marks..... ఇద్దరము ఓపెన్ కాంపిటీషనే ... ఇద్దరమూ I.A.S కే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాము....IFS option కూడా వుంది కానీ , compromise కాలేకున్నాము.చివరి IAS probable,మిగతా services ఉన్నాయి కానీ ....!!! సరే చావో బతుకో తేల్చుకుందామనుకున్నా....చెప్పడం మరచి పోయా... ఇదే నా చివరి అవకాశం... If not IAS...???? నాకు వేరే Services కు వెళ్ళాలని లేదు.. మా నాన్న గారిని కష్ట పెట్ట లేను....సంఘర్షన....!! నేరు గా వెళ్ళి అడిగేద్దామా...Senthil please compromise అని.... ఇంతలొనే నా అలోచన మీద నాకే అసహ్యం వేసింది....!! ఇదేంటి?? అస్సలు ఈ ఆలోచన ఏంటి?? ఐనా ఇది నాకు రావాల్సిన ఆలోచనేనా?? పరి పరి విధాలుగా వెళ్తున్న ఆలోచనలకు Break అన్నట్లు వర్తమానం....Interview room లోకి ఎంట్రీ....ముగ్గురు panel members(neutral jury.-అంటే.. మీరు ఆలోచించినట్లు కాదు.. వేరే రాష్త్రపు వాళ్ళన్నమాట....పక్షపాతం లేకుండేందుకు.......)...వారికి కూడా....ఇలాంటిది కొత్త అనుకుంటా.. !!! Straight గా విషయానికి వచ్చేశారు...(Conversation ఆంగ్లమే సుమా.....)!!!ఆబ్బాయిలూ మీ ఇద్దరూ సమ వుజ్జీలు గా వున్నారు.ఇద్దరూ I.A.S కే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు.... .. ముందుగా ఒక విషయం... మీలో ఎవరన్నా compromise కాదల్చుకుంటే..OK !!!లేకుంటే...రాపిడ్ round తప్పనిసరి...అని మావంక చూసి ,అనుకూల వాయువులు లేవని,confirm చేసుకొని...Interview rules ...చెప్పారు....అదేంటంటే...వారు ఒక ప్రశ్నమాత్రమే అడుగుతారు... ఎవరు ముందు గా చెయ్యి ఎత్తుతారో వారు answer చెయ్యాల్సి వుంటుంది.....ఒక వేళ అతను wrong answer చేసినా లేక మరొక అభ్యర్థి చెయ్యెత్తిన వ్యక్తి కన్నామెరుగైన జవాబు చెప్పినా... చెయ్యెత్తిన అభ్యర్థి...FAIL..!!! అంటే పొరపాటున FAIL ఇతే No..I.A....S....!! సరే కానీ.... ఏమి చెయ్యగలం....ఇంతలోనే...Jury members రెండు చీటీలు తీసి ఒకటి ఎంచుకోమన్నారు...తీరా అవి Subject related chits...ఖర్మకాలి Geography లోనుంచి ప్రశ్న అడగాలని Jury నిర్ణయం... (మనలో మన మాట Geography చాలా vast(not a Waste)...Comaritively with Anthropology.)..Hmm!!! ప్రశ్న అడిగేశారు: నేను అలోచనల నుండి బయట పడేటప్పటి కే.. సెంథిల్ గాడు/గారు చెయ్యెత్తాడు... చాలా చిన్న ప్రశ్న....నేను చెయ్యి ఎందుకు ఎత్తలేకపోయానో..తెలియలేదు...అయిపోయింది... జరగాల్సినదంతా...!!! అడిగిన ప్రశ్న ..."భూ భాగాన్ని ఉష్నోగ్రతల పరంగా ఎన్ని మండలాలుగా విభజించారు?"....
చాలా చిన్న ప్రశ్న... అస్సలు చెప్పాలంటే అది ప్రశ్నే కాదు.మా వూర్లో 3 వ క్లాస్ పిల్లోడిని అడిగినా చెప్పేస్తాడు......
సెంథిల్ ముఖములో విజయ దరహాసము...జవాబు చెప్పసాగాడు...1.శీతల మండలము...2.సమశీతోష్ణ మండలము మరియు 3.ఉష్ణ మండలము...!! ...Right Answer.....Jury అభినందించారు....వాళ్ళ లెక్కలోవో చూసుకుంటున్నారు.... ఈలోపే ఆంధ్ర Brain లో ఒక అవిడియా..తళుక్కున మెరిసింది....అప్రయత్నం గా చెయ్యి పైకి లేచింది....Jury అవాక్కయ్యారో లేదో తెలీదు కానీ.... సెంథిల్ మాత్రం షాక్ అయ్యాడు.....Jury ముఖం లో ఆశ్చర్యం.....Carry on అన్నట్లు...సైగ....Start చేసా సమధానం చెప్పడం.....1.శీతల మండలము...2.సమశీతోష్ణ మండలము 3.ఉష్ణ మండలము మరియు ....కాసేపు 'PAUSE' ఇచ్చా .... అందరి ముఖములో విస్మయం.... చిన్నగా వూపిరి పీల్చుకుని మరలా ...!! చెప్పా...!!! ...!!! 4.చెన్న పట్టణం(తెలియనోళ్ళకు its nothing but CHENNAI).... ఒక్క నిమిషం.... PinDrop silence......Jury members అవాక్కయ్యారు...నా confidence చూసి.. confirmation కోసం Laptop open chesi గూగుల్ లో వెతుకులాడి..30 నిమిషాలు కుస్తీ పట్తి..నా జవాబే మెరుగైనది అన్న కితాబు.. ఇక చూడంది పొగడ్తలే పొగడ్తలు.... నాదే..Best Answer...ఇంకా చదవాలనా....నేనే I.A.S...నేనే I.A.S...నేనే I.A.S....
గమనిక: సెంథిల్ కు ఈచిన్న విషయం ఎందుకు తెలియదు అన్న సందేహం మీకు రావడం సహజమే.. పాపం.. ఇది అతని తప్పు కాదు... వారి వూరు ఊటి....నేనుండేది చెన్న పట్టణము...ఈ గెలుపు చెన్నై కి అంకితం చేస్తూ..మీ ...స్వాప్నికుడు...